భార్యను అదనపు కట్నం తెమ్మంటూ వేధింపులకు గురి చేస్తున్న ఘటనపై సోమవారం పోలీసులు కేసు నమోదు
చేశారు. యాడికి మండలం చిక్కేపల్లి గ్రామానికి చెందిన మహిళను కదిరికి చెందిన ఓ వ్యక్తితో కట్న కానుకలు ఇచ్చి పెద్దలు వివాహం జరిపించారు. కొద్ది నెలలు సంసారం సవ్యంగా సాగినా అనంతరం అదనపు కట్నం తీసుకురావాలని భర్త తరచూ వేధించాడు. గృహహింస కింద భర్త, బావలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.