ఉదయగిరి: ఆటో డ్రైవర్లను హెచ్చరించిన ఎస్సై
ఉదయగిరి పట్టణంలోని ఆటో డ్రైవర్లకు ఉదయగిరి ఎస్సై కర్ణాటి ఇంద్రసేనారెడ్డి పలు సూచనలు చేశారు. ఉదయగిరి బస్టాండ్ సెంటర్లో ఆదివారం ఆయన ఆటో డ్రైవర్లు, యూనియన్ నాయకులతో మాట్లాడారు. దుకాణాలు ఎదుట ఆటోలు నిలపరాదని, ప్రయాణికుల పట్ల దురుసుగా ప్రవర్తించవద్దని తెలిపారు. ఇటీవల కాలంలో ఆటో డ్రైవర్ల ప్రవర్తన పై కంప్లైంట్ లు వస్తున్నాయని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. యూనియన్ పరంగా ఎటువంటి సమస్యలు ఉండకూడదన్నారు.