ఉరవకొండలో టీడీపీ ముస్లిం మహిళా కార్యకర్తలపై దాడి..

575చూసినవారు
ఉరవకొండలోని 1వ వార్డులో ప్రచారం చేస్తున్న టీడీపీ కార్యకర్తలను వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. ఇంటింటికీ వెళ్లి పథకాల గురించి వివరిస్తూ, వారి సమస్యలను అడుగుతున్న ముస్లిం మహిళలపై దురుసుగా ప్రవర్తించారు. ఇద్దరు ముస్లిం మహిళపై దాడికి పాల్పడి గాయపరిచారు. దాడి ఘటనను ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై ఆర్వో కేతన్ గార్గ్‌కు ఆయన ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్