ఆమదాలవలస మండలం కొత్తకోటవారివీధిలో శుక్రవారం కృత్విక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనాధలకు, వృద్ధులకు, వికలాంగులకు భోజన పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఈ సంస్థ ఫౌండర్ చిగురుపల్లి చిన్ను మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు చేయడం సంతోషకరంగా ఉందని తెలిపారు. సేవలను మరింత విస్తృతం చేయనున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు రాము, హరీష్, సాయి, రామారావు, తదితరులు పాల్గొన్నారు.