పొందూరు పట్టణంలో డయేరియా బారినపడిన పలు కుటుంబాలను సోమవారం ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ సందర్శించారు. బాధితులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ల బృందానికి పలు సూచనలు చేస్తూ, వెంటనే చికిత్స అందించాలని, వ్యాధి మరింత వ్యాపించకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట వైద్యాధికారులు ఉన్నారు.