ఆముదాలవలస మండలం మునగవలస పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం ఉపాధి హామీ పథకం ద్వారా జరిగిన పనులకు సామాజిక తనిఖీ గ్రామ సభలు నిర్వహించారు. పనులకు రూ. 69, 03, 556 నిధులు కేటాయించినట్లు అధికారులు తెలిపారు. ఏపీవో లక్ష్మీ నరసింహ ఆధ్వర్యంలో డిఆర్పీలు గ్రామ సభల్లో తనకి చేసిన పనులను, వివరాలను వెల్లడించారు.