జి. సిగడాం మండలం నిద్దాం గ్రామంలో ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పంపిణీ కార్యక్రమాన్ని గురువారం ఉదయం స్థానిక ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక కూటమి నేతలు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకే నేరుగా పింఛన్లు అందజేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు పెంచిన పింఛన్లను ప్రజల వద్దకే అందిస్తున్నారని అన్నారు.