ఎచ్చెర్ల మండలం పోలీస్ క్వార్టర్స్ లో ఉన్న గవర్నమెంట్ హై స్కూల్ లో ఎస్ఎంసి ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పాఠశాల చైర్మన్ గా డోలే రవివర్మ, వైస్ చైర్మన్ గా పొన్నాడ రామారావు ఎన్నికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీరామ్ మూర్తి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామన్నారు.