ఎచ్చెర్ల మండలం చిలకపాలెం గ్రామంలో ఉన్న స్మశాన వాటిక ప్రహరీ గోడకు, మెయిన్ గేటుకు మరమ్మత్తులను టిడిపి సీనియర్ నాయకులు బెవర శ్రీనివాసరావు తన సొంత నిధులతో చేపట్టినట్లు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. గత కొన్ని ఏళ్లుగా స్మశానికి వాటిక అస్తవ్యస్తంగా తయారైందని, అందుకే మరమ్మతులు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో 8వ వార్డు మెంబర్ బోను శ్రీను, తదితరులు ఉన్నారు.