శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని ఐఐఐటి ప్రాంగణంలో స్టూడెంట్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో.. జాతీయ ఆత్మహత్య నివారణ దినోత్సవాన్ని మంగళవారం నిర్వహించామని ప్రాంగణ డైరెక్టర్ బాలాజీ తెలిపారు. ఈ సందర్బంగా మానసిక ఆరోగ్య వైద్యులు డా. శ్రీనివాస్ మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రతి విషయాన్ని జాగ్రత్త అవగాహన చేసుకోవాలన్నారు. ఏ చిన్న విషయానికి ఆత్మహత్య చేసుకోరాదన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.