స్వచ్ఛత పై సమాజంలో మరింత అవగాహన పెంచేందుకు ఇచ్చాపురంలో ర్యాలీ నిర్వహించామని జ్ఞాన భారతి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సెక్రెటరీ, సీఈవో జోహార్ ఖాన్ అన్నారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు మంగళవారం పాఠశాలలో స్వచ్ఛత హి సేవా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించామన్నారు. పాఠశాల నుండి దాసన్నపేట, బస్టాండ్ హాస్పిటల్ రోడ్డు మీదుగా విద్యార్థులతో ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు.