ప్రభుత్వం జారీ చేసిన జీఓ 85 వ్యతిరేకంగా పిహెచ్సి వైద్యాధికారులు నల్లబ్యాడ్జీలు ధరించి శుక్రవారం నిరసన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారుల అసోసియేషన్ పిలుపు మేరకు హిరమండలం, చొర్లంగి పిహెచ్సి వైద్యాధికారులు సాయి గీత, ఫరూక్ హుస్సేన్, యశ్వంత్, సంతోష్ నిరసన తెలిపారు. పిహెచ్సి పరిధిలోని గ్రామాలు రోగులకు ఓపీ వైద్య సేవలు నిలిపివేశారు. వైద్యాధికారులు మాట్లాడుతూ.. వృత్తి ప్రగతికి జి.ఓ తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెప్పారు .