ఓం శాంతి బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని చాపర గ్రామంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో పలుచోట్ల మొక్కలు నాటారు. అనంతరం పలువురు మాట్లాడుతూ. గాలి, నీరు, ఆకాశం, అగ్ని, భూమి పంచభూతాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రకృతిని ఆరాధించాలని ఆకాంక్షించారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ దేవేంద్రరావు, ఓంశాంతి బ్రహ్మకుమారులు గ్రామ ప్రజలు పలువురు పాల్గొన్నారు.