రేగిడి మండల తహసిల్దారుగా జే.రాములమ్మ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈమె విజయనగరం జిల్లా జేఎల్ పురం తహసిల్దారుగా పనిచేస్తూ బదిలీపై తహసిల్దారుగా బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ తహసిల్దారుగా పనిచేసిన బి. సుదర్శన రావు విజయనగరం జిల్లా దత్త రాజేరు మండల తహసీల్దారుగా బదిలీపై వెళ్లారు. ముందుగా నూతన తహసిల్దార్ రాములమ్మకు డిప్యూటీ తహసిల్దార్ సత్యనారాయణ, ఆర్ ఐ రేవతి, ఏఎస్ఓ ఏసుబాబు స్వాగతం పలికారు.