నందిగాం: జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

54చూసినవారు
నందిగాం: జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
నందిగాం మండలం సుభద్రాపురం హైవేపై సోమవారం సాయంత్రం ప్రమాదం చోటు చేసుకుంది. టెక్కలి నుంచి పలాసకు లగేజ్ వ్యాన్, ద్విచక్రవాహనం హైవేపై వెళ్తున్నాయి. లగేజ్ వ్యాన్ ఒక్కసారిగా యూటర్న్ తీసుకోవడంతో వెనుక నుంచి వచ్చిన బైక్ ఢీకొంది. బైక్ మీద ఉన్న ముగ్గురికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న 1033 హైవే అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.