ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల మేరకు గురువారం మందు గుండు అమ్మకాలు జోరుగా సాగాయి. సామాగ్రి కొనుగోలుకు వచ్చిన వారు మాత్రం కొంతమేర అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ఏడాది కంటే ఈ ఏడాది ధరల పెరిగాయని వాపోయారు. పెద్ద క్రాకర్స్ ఒక ప్యాకెట్ రూ. 250 వరకు పలుకుతుందని అన్నారు. ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవడంతో ఎటువంటి దుర్ఘటనలు జరగలేదు.