బూర్జ మండలంలోని పాలవలస, రామన్నపేట, బూర్జ గ్రామాలలో ప్రకృతి వ్యవసాయం చేసే ఉత్పత్తులకు ఆర్గానిక్ సర్టిఫికేషన్ కొరకు ఆరుగురు రైతులు చొప్పున లోకల్ గ్రూపులుగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి శనివారం థర్డ్ పార్టీ వెరిఫికేషన్ జరిగింది. ఈ సందర్భంగా పకృతి వ్యవసాయ మార్కెటింగ్ ఏం. టి చిన్నమ్మడు మాట్లాడుతూ ఈ పద్ధతిలో పండించిన ధాన్యాన్ని మార్కెట్ రేటు కంటే 15 శాతం అదనంగా ధర ఇచ్చి కొనుగోలు చేస్తామని రైతులకు అవగాహన కల్పించారు.