నిర్మాణంలో వున్న ఇళ్లను మార్చిలోగా పూర్తిచేయాలి

68చూసినవారు
నిర్మాణంలో వున్న ఇళ్లను మార్చిలోగా పూర్తిచేయాలి
జిల్లాలో నిర్మాణం ప్రారంభించిన ఇళ్లన్నింటినీ మార్చి నెలాఖరులోగా శతశాతం పూర్తిచేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఎం. డి. పి. రాజాబాబు హౌసింగ్ ఇంజనీర్లను ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాలను ఒక దశ నుంచి మరో దశకు నిర్ణీత కాలవ్యవధి ప్రకారం పూర్తిచేయాలని స్పష్టంచేశారు. శనివారం ఆయన జిల్లాలో పలు ప్రాంతాల్లో పర్యటించారు. రాగోలు, గాజుల కొల్లివలసలలో కాలనీలను సందర్శించి ఇళ్ల నిర్మాణ ప్రగతిని పరిశీలించారు.

సంబంధిత పోస్ట్