మునగవలస, కొండవలసగ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థి అన్నాజీ ప్రచారం
ఆముదాలవలస నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సనపల అన్నాజీ రావు మంగళవారం మండలంలో మునగవలస, కొండవలస గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో వివరిస్తూ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. గత కాంగ్రెస్ హయాంలో నియోజకవర్గంలో జరిగిన అనేక అభివృద్ధి కార్యక్రమాలను, అమలు జరిగిన సంక్షేమ పథకాలను వివరించారు. కాంగ్రెస్ పార్టీతోనే ఆంధ్రప్రదేశ్ కు పూర్వవైభవం వస్తుందన్నారు