ఎచ్చెర్ల: పుస్తక పఠనం నిరంతర ప్రక్రియగా అలవర్చుకోవాలి: వీసీ

74చూసినవారు
ఎచ్చెర్ల: పుస్తక పఠనం నిరంతర ప్రక్రియగా అలవర్చుకోవాలి: వీసీ
నూతన సాంకేతిక సాధనాలు నుంచి ఎంత సమాచారం తెలుసుకుంటున్నప్పటికీ పుస్తక పఠనాన్ని మరిచిపోరాదని ఎచ్చెర్లలోని డా. బి. ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయం విసి ఆచార్య కె. ఆర్. రజని సోమవారం అభిప్రాయపడ్డారు. సామాజిక, సాంస్కృతిక, సాహిత్య, సమకాలీన, విద్యారంగాలకు చెందిన పుస్తకాల అభ్యసనమనేది నిరంతర ప్రక్రియగా అలవరుచుకోవాలన్నారు. విశాలాంధ్ర ప్రచురణ సంస్థకు చెందిన మొబైల్ వాహన పుస్తక ప్రదర్శనను క్యాంపస్ లో ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్