ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటం చేస్తానని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పాకలపాటి రఘువర్మ అన్నారు. ఈ మేరకు మంగళవారం సంతపురిటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆయన ప్రచారాన్ని నిర్వహించారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో తనకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు మజ్జి మదన్మోహన్, జిల్లా కార్యదర్శి పప్పల తిరుమలరావు ఉన్నారు.