ఎచ్చెర్ల: భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం
ఎచెర్ల అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద రాజ్యంగ హక్కుల పరిరక్షణ వేదిక నాయకులు కరపత్రాలను మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత పాలకుల ఏలుబడిలో ప్రజాస్వామ్యానికి లౌకిక తత్వానికి సామాజిక న్యాయానికి ప్రమాదం పొంచి ఉన్నదన్నారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు మిస్కా కృష్ణయ్య, దుర్గాసి గణేష్, రాకోటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.