సోంపేట మండలం కొర్లాం సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. విశాఖ నుంచి జార్ఖండ్ కు బొగ్గు పౌడర్ లోడుతో వెళ్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో అదుపుతప్పి రహదారికి అడ్డంగా బోల్తా పడింది. దింతో డ్రైవర్ చిన్నపాటి గాయాలతో బయటపడ్డాడు. నేషనల్ హైవే సిబ్బంది, పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వ్యక్తికి ప్రథమ చికిత్స అందించారు.