విశ్వవిద్యాలయం విద్యార్థినికి నాలుగో బహుమతి
రాష్ట్రస్థాయిలో కళాశాల, విశ్వవిద్యాలయాల విద్యార్థులకు రామకృష్ణ మిషన్-విశాఖపట్నం నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో శ్రీకాకుళం డా. బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం విద్యార్ధిని ప్రతిభ కనపరిచింది. స్పెషల్ బి. ఇడి విద్యార్థిని శిరీషా 'స్వామి వివేకానంద-విశిష్టమైన భారతీయ సంస్కృతి' అంశంపై రాసిన వ్యాసానికి నాలుగో బహూమతి లభించింది. ఈ మేరకు వర్శిటీ వైస్-ఛాన్సలర్ ఆచార్య కె. ఆర్. రజని శుక్రవారం అభినందించారు.