సోంపేట మండల కేంద్రంలో సోంపేట పోలీస్ స్టేషన్ సిబ్బంది శుక్రవారం సాయంత్రం ముమ్మరంగా ద్విచక్ర వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్మెట్ ధరించని వాహనదారులకు ఫైన్ విధించారు. ఈ సందర్భంగా పోలీసులు వాహనదారులకు హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సోంపేట పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.