Feb 28, 2025, 11:02 IST/
ఆ ఇళ్లను కూల్చబోం: హైడ్రా రంగనాథ్
Feb 28, 2025, 11:02 IST
హైదరాబాద్లోని సున్నం చెరువు, తమ్మిడికుంట, కూకట్పల్లి నల్లచెరువు, ఉప్పల్ నల్ల చెరువు, భుమ్రుఖ్ ఉద్దీన్ దౌలా చెరువులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ శుక్రవారం పరిశీలించారు. చెరువుల బఫర్ జోన్లలో ఇంటి స్థలాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం TDR కింద సహాయం అందిస్తుందని చెప్పారు. ఇప్పటికే నివాసాలున్న ఇళ్లను కూల్చబోమన్నారు. చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణ, సుందరీకరణ పనుల్లో ఎక్కడా నివాసాలను తొలగించమని స్పష్టం చేశారు.