శ్రీముఖలింగేశ్వరుని సన్నిధిలో ఆర్డీవో రంగయ్య

67చూసినవారు
శ్రీముఖలింగేశ్వరుని సన్నిధిలో ఆర్డీవో రంగయ్య
జలుమూరు మండలంలోని శ్రీముఖ లింగంలో కొలువైన శ్రీముఖలింగేశ్వర స్వామిని శ్రీకాకుళం డివిజనల్ రెవెన్యూ అధికారి సిహెచ్ రంగయ్య దర్శించుకున్నారు. బుధవారం ఆలయానికి చేరుకున్న ఆయనకు స్థానిక దేవాదాయ శాఖ సిబ్బంది సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ విశిష్టతను స్థానిక అర్చకులు ఆయనకు తెలిపారు. ఆయనతో పాటు జలుమూరు తహశీల్దార్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్