జలుమూరు మండలం మాకివలస ఎస్సీ గ్రామంలోని ఆదివాసీలకు అన్ని విధాల న్యాయం చేస్తానని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ భరోసా ఇచ్చారు. బుధవారం ఆయన జలుమూరు మండలంలోని మాకివలస గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక రెవెన్యూ అధికారులను పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు యోగి మాట్లాడుతూ. ఇక్కడ జరుగుతున్న పరిస్థితిని ఆయనకు వివరించారు.