ఈ నెల 8న కోటబొమ్మాలిలో పీడీఎస్ బియ్యం బహిరంగ వేలం
కోటబొమ్మాళి మండల తాహాసిల్దార్ కార్యాలయం వద్ద ఈనెల 8వ తేదీ మధాహ్నం 3 గంటలకు సీజ్‌చేసి పట్టుకున్న 21, 970 కిలోల పీడీఎస్ బియ్యంను బహిరంగ వేలం పాట వేయటం జరుగుందని తహసీల్ధార్ పి. లత్సాపాత్రుడు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దుర్గంపేటలోని శ్రీవసంత లక్ష్మి మోడరన్ రైస్ మిల్లు గోడౌన్ లో అక్రమంగా నిల్వ ఉంచిన 21, 970 కిలలో పీడీఎస్ బియ్యాన్ని విజిలెన్సు అధికారులు దాడి చేసి పట్టుకున్నారన్నారు.