Sep 13, 2024, 14:09 IST/
ట్రైన్లో 11 ఏళ్ల బాలికను లైంగిక వేధించాడని రైల్వే ఉద్యోగిని కొట్టి చంపిన ప్రయాణికులు
Sep 13, 2024, 14:09 IST
బీహార్లోని బరౌని నుంచి ఢిల్లీకి వెళ్లే హమ్సఫర్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ప్రశాంత్ అనే రైల్వే ఉద్యోగిని కొట్టి చంపారు. బాధితురాలి కుటుంబం బీహార్లో రైలు ఎక్కగా, తల్లి లేని సమయంలో బాలికను సదరు వ్యక్తి లైంగికంగా వేధించాడు. ఈ విషయం బాలిక తన తల్లికి చెప్పగా ఆమె కుటుంబం, ఇతర ప్రయాణికులు నిందితుడిని చితకబాదారు. పోలీసులు అతడిని కాన్పూర్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయాడు.