అమెరికాలో శాంతి భద్రతలకు పెద్దపీట వేసి నేరస్థులకు కఠిన శిక్షలు అమలు చేస్తానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల మరణశిక్షకు గురైన 40 మంది ఖైదీలకు పెరోల్ లేకుండానే జీవిత ఖైదుగా మారుస్తున్నట్లు ప్రకటించారు. ఈ అంశంపై ట్రంప్ స్పందిస్తూ తాను ప్రెసిటెండ్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటనే రేపిస్టులకూ, తీవ్రమైన నేరాలకూ పాల్పడే వారికి మరణశిక్ష విధిస్తానన్నారు.