పోలాకి మండలం బెలమర పాలవలస గ్రామంలో శనివారం సాయంత్రం వృద్ధురాలు మెడలో బంగారం గొలుసు చోరీకి గురి అయింది. ఎస్సై రంజిత్ తెలిపిన వివరాల మేరకు శనివారం సాయంత్రం వాకింగ్ కోసం వృద్ధురాలు పొట్నూరు వెంకటరత్నం వెళుతుండగా ద్విచక్ర వాహనంపై ఇద్దరు దుండగులు వెళ్లి చోరీకి పాల్పడ్డారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.