కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ కదం తొక్కిన కార్మికలోకం

381చూసినవారు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ కదం తొక్కిన కార్మికలోకం
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ.. సిఐటియు ఆధ్వర్యంలో నరసన్నపేటలో ఎండిఓ ఆఫీస్ నుండి లక్ష్మీ టాకీస్ వరకు ప్రదర్శన అనంతరం నిరసన వ్యక్తం చేశారు. పురవీధుల్లో కార్మికులు ఊరేగింపు, ర్యాలీ చేశారు.

ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్. సురేష్ బాబు జిల్లా నాయకులు వై. చలపతిరావు మాట్లాడుతూ కరోనా మహమ్మారి అడ్డంగా పెట్టుకుని కార్మిక చట్టాలు రద్దుచేసి 8గంటలనుండి 12 గంటల కు పెంచడము ఏమిటని ప్రశ్నించారు. లాక్‌డౌన్‌ సమయంలో కార్మికులకు ఉపాధి కల్పించకుండా కార్మికులను తొలగించడం మానుకోవాలని హితవు పలికారు.

కార్పొరేట్లకు 20 లక్షల కోట్ల రూపాయలు పనులు రాయితీలు కల్పించడం ప్రభుత్వాలు సేవ చేయడం విడ్డూరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.వలస కార్మికుల చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని ఖాళీగా ఉన్న చోట స్థానికులకు ఉపాధి కల్పించాలని అన్నారు. కార్మికుల కుటుంబాలకు నెలకు పదివేల రూపాయలు చొప్పున మూడునెల లు ఇవ్వాలి. ఆరునెలలపాటు మనిషికి నెలకు ఐదు కిలోల చొప్పున రేషన్ ఇవ్వాలి. కరోనాసేవలో ఉన్న స్కీం వర్కర్లు ఉద్యోగులకు పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు భద్రతా పరికరాలు ఇవ్వాలని భీమా సౌకర్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

మధ్యాహ్నం భోజన కార్మికులకు పెండింగ్ బిల్లులు వేతనాలు ఇవ్వాలన్నారు. ఎలక్ట్రిషన్ ప్లంబర్ పనిముట్లు కిట్ లు ఇవ్వాలన్నారు.పంచాయతీ పారిశుధ్య కార్మికులకు రెగ్యులర్ చేయాలని కనీస వేతనం 18000 ఇవ్వాలి అన్నారు. అంగన్వాడీ కార్యకర్తలకు ప్రభుత్వ ఉద్యోగ గుర్తింపు ఇవ్వాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ సౌకర్యం ఇవ్వాలన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ ఫ్రిజ్ ను రద్దు చేయాలన్నారు. నష్టదాయకమైన విద్యుత్ చట్ట సవరణ 2025 కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టి. మోహన్ రావు నీల రాజు రమేష్ లక్ష్మణ రావు, రాము జగదీశ్వరి, రాధా కాంతమ్మ లక్ష్మి కేశవ, గిరి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్