మందస మండలం బాలిగాం గ్రామ సమీప జాతీయ రహదారిపై సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న కారును వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో కారు వరద కాలువలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో వాహనాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు.