ప్రభుత్వ రంగ సంస్థలను పోరాటాలతోనే కాపాడుకోవాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం మందస మండలం హరిపురం జడ్పీహెచ్ఎస్ ప్లస్ ఆవరణలో నిర్వహించిన యూటీఎఫ్ స్వర్ణోత్సవ జిల్లా మహాసభలకు ఆయన హాజరయ్యారు. ముందుగా హరిపురం మెయిన్ రోడ్లో యుటిఎఫ్ సభ్యులు భారీ ర్యాలీ నిర్వహించారు. పలువురు వక్తలు మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి పోరాటం ఒక ఆయుధం అన్నారు.