మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబుని శనివారం పలాస శాసనసభ్యులు గౌతు శిరీష, ఆమె భర్త వెంకన్న చౌదరి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ హరిబాబు మాట్లాడుతూ మా గౌతు లచ్చన్న మనవరాలు ఎమ్మెల్యే అవడం తను ప్రజా గొంతు వినిపించే స్థాయికి రావడము చాలా ఆనందకరంగా ఉంది అని పేర్కొన్నారు. అనంతరం ఆమెను శాలువాతో సత్కరించి అభినందించారు.