న్యాయం అందించే ప్రక్రియలో ఆలస్యాన్ని నిర్మూలించేందుకు దశాబ్ద కాలంగా అనేక స్థాయుల్లో శ్రమించామని ప్రధాని మోడీ అన్నారు. గత పదేళ్లలో జుడీషియల్ ఇన్‌ఫ్రా అభివృద్ధికి రూ.8000 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. 25 ఏళ్లలో పెట్టిన ఖర్చులో 75% గత పదేళ్లలోనే చేశామన్నారు. 'వికసిత భారత్ 140 కోట్ల మంది కల. మన ఆలోచనలు, పట్టుదల అభివృద్ధి చెందిన భారత్ కోసమే. ఆ విజన్‌కు న్యాయ వ్యవస్థ 'మూలస్తంభం' అని ఆయన చెప్పారు.