కాఫీలో బొద్దింక.. కస్టమర్ షాక్

68చూసినవారు
కాఫీలో బొద్దింక.. కస్టమర్ షాక్
ముంబైలోని హోప్‌ అండ్‌ షైన్‌ లాంజ్‌ హోటల్‌‌లో ఓ కస్టమర్‌కు ఊహించని అనుభవం ఎదురైంది. ఆ హోటల్‌కు రావత్ అనే వ్యక్తి శుక్రవారం వెళ్లాడు. కోల్డ్ కాఫీ ఆర్డర్ చేశాడు. సగం తాగాక అందులో బొద్దింక ఉన్నట్లు రావత్ గుర్తించాడు. దీనిపై హోటల్ సిబ్బందిని ఆయన ప్రశ్నించాడు. వారి నుంచి సరైన సమాధానం రాలేదు. దీనిపై పోలీసులకు రావత్ ఫిర్యాదు చేశాడు. హోటల్ మేనేజర్, వెయిటర్‌, ఇతరులపై మలాడ్ పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్