దేశంలో మహిళల భద్రత కోసం కఠినమైన చట్టాలు ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. వాటిని కట్టుదిట్టంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. మహిళలపై అఘాయిత్యాలు, పిల్లల భద్రతపై సమాజంలో తీవ్రమైన ఆందోళన నెలకొందని, ఇలాంటి కేసుల్లో కోర్టులు వీలైనంత త్వరగా తీర్పులివ్వాలని సూచించారు. అలా జరిగినప్పుడే చాలా మందికి భద్రతపై హామీ ఏర్పడుతుందని తెలిపారు. కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం-హత్య ఘటన తర్వాత మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.