తల్లిపాల వారోత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే శిరీష

67చూసినవారు
మారుతున్న సమాజంలో పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడిపోతున్నామని, తల్లిపాలు బిడ్డకు అమృతం కంటే ఎక్కువని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. పలాస ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లిపాలు శ్రేష్టమని అది బిడ్డకు రోగ నిరోధికశక్తి కలుగజేస్తుందని, ప్రభుత్వం కూడా పుట్టిన బిడ్డల పట్ల జాగ్రత్తలు తీసుకుంటుందని ఆమె తెలిపారు.

సంబంధిత పోస్ట్