టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు గౌతు శ్యాంసుందర్ శివాజీ హెచ్చరించారు. సోమవారం సాయంత్రం పలాస కార్యాలయంలో మాట్లాడుతూ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకి మతి భ్రమించిందని ఎద్దేవా చేశారు. గడిచిన ఐదేళ్లుగా అప్పలరాజు సెటిల్మెంట్ రారాజుగా పేరుగాంచారని, గత ప్రభుత్వ హయాంలో కొండలు, ప్రభుత్వ భూములు కబ్జాలు చేసి ఇప్పుడు నీతులు చెప్పుతుంటే హస్యాస్పదంగా ఉందన్నారు.