ఉపాధి హామీలో సామాజిక తనిఖీకి సమర్పించవలసిన దస్త్రాలను సత్వరమే సిబ్బంది సిద్ధం చేయాలని ఉపాధి హామీ ఏపీఓ రవి ఈసీ ఆదినారాయణ రెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక ఉపాధి హామీ కార్యాలయంలో దస్త్రాలను పరిశీలించారు. ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ జరుగుతుందని దానికి సంబంధించిన రికార్డులు క్షేత్రస్థాయిలో సిద్ధం చేయాలని, సమస్యలు రాకుండా ఏకాగ్రతతో పనిచేయాలని అన్నారు.