మెలియాపుట్టి: గుంతలు లేని రహదారుల నిర్మాణమే లక్ష్యం

77చూసినవారు
గుంతలు లేని రహదారుల నిర్మాణమే ప్రభుత్వం లక్ష్యంగా కృషి చేయడం జరుగుతుందని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. మెలియాపుట్టి మండలం పట్టుపురం నుంచి కోసమాల వరకు ఉన్న గుంతలను పూడ్చేందుకు శనివారం ఆయన పనులను ప్రారంభించారు. ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న శిథిల రహదారులకు నిధులను మంజూరు చేశారని పేర్కొన్నారు. ఈ క్రమంలోని పనులను చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు.

సంబంధిత పోస్ట్