వ్యవసాయం లాభసాటి కావాలి....రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్

566చూసినవారు
వ్యవసాయం లాభసాటి కావాలి....రాష్ట్ర  ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్
రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులను పెంచి, రైతుల ఆదాయాన్ని పెంపొందించేలా రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నైరా వ్యవసాయ కళాశాల ప్రాంగణంలో కిసాన్ మేళా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర పశు సంవర్ధక, పాడి పరిశ్రామిభివృద్ధి మరియు మత్స్య శాఖ మంత్రి డా. సీదిరి అప్పలరాజుతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత భారత తొలి రాష్ట్రపతి భారతరత్న డా. రాజేంద్ర ప్రసాద్ జయంతిని పురష్కరించుకొని జాతీయ వ్వవసాయ దినోత్సవ కార్యక్రమాన్ని ఉపముఖ్యమంత్రి ప్రారంభించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్