మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగింది. నిందితుడు చిన్నారికి మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం. నిందితుడిని ఎలాగైనా సరే పట్టుకుని కఠినంగా శిక్షించాలని చిన్నారి తల్లిదండ్రుల డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.