కొన‌సాగుతున్న హుండీ లెక్కింపు

59చూసినవారు
కొన‌సాగుతున్న హుండీ లెక్కింపు
శ్రీ‌కాకుళం న‌గ‌రంలోని ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్ర‌మైన అర‌స‌వ‌ల్లి ఆదిత్యుని ఆల‌య హుండీ లెక్కింపు కొనసాగుతోంది. ఆల‌య డిప్యూటీ క‌మిష‌న‌ర్ చంద్ర‌శేఖ‌ర్ ఆధ్వ‌ర్యంలో ముగ్గురు ఈవోలు, ఇద్ద‌రు ఇన్‌స్పెక్ట‌ర్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఈ లెక్కింపు కార్య‌క్ర‌మం సోమ‌వారం జ‌రుగుతోంది. వైశాఖ మాసం సంద్భంగా ఆల‌యానికి భ‌క్తుల ర‌ద్దీ అధికంగా ఉన్న దృష్ట్యా సుమారు 300 మందితో ఈ లెక్కింపు కొన‌సాగుతోంద‌ని డీసీ చంద్ర‌శేఖ‌ర్ తెలిపారు.