ఎన్నికల సమయంలో
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరుతో హామీలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మహాలక్ష్మి స్కీమ్ కింద మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ స్కీమ్ అమలు కోసం మహిళలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే.. ఈ రోజు తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఈ స్కీమ్ గురించి ప్రస్తావించకపోవడంతో దీని అమలు ఈ ఏడాది ఉండకపోవచ్చన్న చర్చ సాగుతోంది.