విద్యతోనే అభివృద్ధి జరుగుతుందనే ధ్యేయంతోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర కళింగ కార్పొరేషన్ చైర్మన్ పేరాడ తిలక్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ఉచితంగా అందజేసిన ట్యాబుల ను శుక్రవారం నందిగాం, దిమ్మిడిజోల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ నడుపూరు శ్రీరామమూర్తి తో కలిసి విద్యార్థులకు అందచేశారు.