సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా ఏపీ సిపిఎస్ఈఏ నాయకులు రెడ్డి సూరిబాబు, తలగాన చంద్రశేఖర్, బాడాన రాజు, యు. శ్రీనివాసరావు లు సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్సన్ విధానం పునరుద్ధరించాలని కోరుతూ నరసన్నపేటలో ఎమ్మెల్యే బగ్గు రమణ మూర్తి కి ఆదివారం వినతిపత్రం సమర్పించారు. పాత పెన్షన్ పునరుద్ధరణ కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని ఎమ్మెల్యేకి కోరారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు.