ఏపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పాతర్లపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. జడ్పీ హైస్కూల్ ఆవరణలో నిర్మాణంలో ఉన్న అదనపు భవనం వద్ద సజ్జ కూలి మృతి చెందాడు. పదో తరగతి చదువుతున్న వి.కృష్ణంరాజు(15) అనే సజ్జ కూలి విద్యార్థి చనిపోయాడు. ఈ ప్రమాదంలో తొమ్మిదవ తరగతి చదువుతున్న కోరాడ శ్రీరాములు అనే విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. క్రికెట్ ఆడుతుండగా బాల్ కోసం నిర్మాణంలో ఉన్న భవనం వైపు వెళ్లగా.. ఈ ప్రమాదం జరిగింది.